Apr 03,2022 23:11

విద్యుత్‌ స్తంభాన్ని ఢకొీన్న కారు



ప్రజాశక్తి-కార్వేటినగరం:
విద్యుత్‌ స్తంభాన్ని ఢకొీని కారు ముళ్ళ పొదల్లోకి దూసుకెళ్లిన సంఘటన ఆదివారం పద్మసరస్సు సమీపంలోని చిన్న కనుమ వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు చిత్తూరు నుంచి పుత్తూరు వైపు వేగంగా వెళుతున్న కారు పద్మసరస్సు సమీపంలో చిన్నకనుమ వద్ద జాతీయ రహదారికి పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢకొీనడంతో విద్యుత్‌ స్తంభం రెండుగా విరిగిపోయింది. స్థానికులు కారు వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్సకు ఆస్పతికి పంపించారు. స్థానికుల సమాచారంతో స్పందించిన విద్యుత్‌ సిబ్బంది సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.