Oct 12,2023 17:32

మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి -నెల్లూరు :వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ లక్ష్యమని సి.జి.ఆర్‌.ఎఫ్‌. చైర్‌ పర్సన్‌ ఇ శ్రీనివాస ఆంజనేయ మూర్తి పేర్కొన్నారు. గురువారం విద్యుత్‌ భవన్‌లో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ విద్యుత్‌ అదాలత్‌ కార్యక్రమంలో ఆర్థిక సభ్యులు కె. రామ మోహన్‌ రావు, సాంకేతిక సభ్యులు ఎస్‌.ఎల్‌. అంజనీ కుమార్‌ , స్వతంత్ర సభ్యులు జి.ఈశ్వరమ్మ పలువురు సభ్యులు పాల్గొన్నారు. వారు ఈ అదాలత్‌ లో 8 ఫిర్యాదులు తమ దృష్టి వచ్చినట్లు తెలిపారు. 7 ఫిర్యా దులు అప్పటికప్పుడే పరిష్కరించామన్నారు. మిగిలిన 1 ఫిర్యాదును సంబంధిత అధికారుల ద్వారా ఇచ్చిన షెడ్యూల్‌ తేదీ ప్రకారం పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్స్‌ శ్రీధర్‌, మధు, కిరణ్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌ లక్ష్మీ బారు, విజరు,లక్ష్మీనారాయణ, సుధాకర్‌, చిన్నయ్య, దామోదర్‌, విజయ, సుకు మార్‌, ప్రసాద్‌,గోపి,నస్రుళ్ల, ప్రణీత అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్స్‌ నాగమణి,శ్రీలత జూనియర్‌ ఇంజనీర్స్‌ పాల్గొన్నారు