Oct 03,2022 23:15

సబ్‌ డివిజన్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి- పుంగనూరు : నియోజకవర్గంలోని రైతుల విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం పుంగనూరులో సబ్‌ డివిజన్‌ కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలో సబ్‌డివిజన్‌ కార్యాలయాన్ని సిఎండి సంతోష్‌రావు, ఎస్సీ కష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యలపై సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి డివిజన్‌ కార్యాలయాన్ని మంజూరు చేశారని చెప్పారు. డివిజన్‌ కార్యాలయంలో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించుకోవచ్చు అన్నారు. ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో తిరుపతి, మదనపల్లి సబ్‌డివిజన్‌ పరిధిలో ఉన్న మండలాలను విభజించడం జరిగిందని చెప్పారు. పుంగనూరు, పలమనేరు, సదుం సబ్‌డివిజన్‌ పరిధిలోని మండలాలతో పాటు పుంగనూరు రూరల్‌ మండలం కూడా చేర్చడం జరిగిందన్నారు. రైతులకు ఏసమస్య ఎదురైనా అధికారులు అందుబాటులో ఉంటారని రైతులు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చు అన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌, టిటిడి బోర్డు మెంబర్‌ అశోక్‌ కుమార్‌, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర జానపద కళల అభివద్ధి చైర్మన్‌ నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీమ్‌ బాష, జడ్పిటిసి జ్ఞానప్రసూన చంద్రారెడ్డి యాదవ్‌, సిజిఎం ఆపరేషన్‌ చలపతి, ఈఈ విజయన్‌, డీఈలు రాజశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రెడ్డప్ప, పద్మనాభ పిల్లే, హరి, సురేష్‌బాబు ఏడీలు రవి, చిన్నప్ప, భీమేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
19 సబ్‌ స్టేషన్లు
నియోజకవర్గంలో రైతాంగానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు 19 సబ్‌స్టేషన్లు 33/11 కె.వి సామర్థ్యం గల వాటి నిర్మిస్తున్నామని రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అలాగే డివిజన్‌ కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని తొలగించి నూతన భవనాలు నిర్మించేందుకు నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రైతులు ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు కోసం స్థానికంగా మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తూ అన్ని విధాలా జగన్‌ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వర్ణమ్మ దంపతులు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవికి పట్టువస్త్రాలను సోమవారం సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, దొంతి వెంకటేష్‌, భాను ప్రకాష్‌రెడ్డి ప్రసాద్‌ పి ఎల్‌ శ్రీధర్‌ తదితరులు కలిసి మంత్రి ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
సచివాలయం, ఆర్‌బికెలు ప్రారంభం
పులిచెర్ల: మండలం కల్లూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, పులిచెర్లలో ఆర్బీకే భవనాన్ని సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ విప్లవాత్మక, ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డికి మరెవరూ సాటిలేరన్నారు. ఇతరదేశాలు సైతం మన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఆలోచన చేస్తున్నారన్నారు. ఒక్కో సచివాలయ భవనానికి రూ.40లక్షలు, రైతు భరోసా కేంద్రం భవనానికి 20.5లక్షలు, విలేజ్‌క్లినిక్‌ భవనానికి రూ.17.5లక్షలతో నిర్మాణాలు చేపట్టి భవనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్‌ కుమార్‌, రాష్ట్ర పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌ మురళీధర్‌, ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి, ఆర్డీఓ రేణుక, డీపీఓ లక్ష్మీ, తహసీల్దార్‌ అమర్‌నాథ్‌, ఎంపీడీఓ సుగుణమ్మ, ఈఓపీ ఆర్‌డీ రాజశేఖర్‌, ఏపీఓ షౌకత్‌, ఏపీఎం చంద్రమోహన్‌, ఎంఇఓ సిద్ధరామయ్య, ఈఓ యుగంధర్‌, సీఐ ఆశీర్వాదం, ఎస్సై రవిప్రకాష్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.