
మాట్లాడుతున్న సిఎమ్‌డి పృథ్వితేజ్
ప్రజాశక్తి - కవిటి : విద్యుత్ శాఖ సిఎమ్‌డి పృథ్వితేజ్ మండలంలోని బొరివంక సబ్ స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని పరిస్థితులు, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఉన్న అవరోధాలు ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం సబ్ స్టేషన్ పరిధిలో మొక్కలు నాటారు. సర్పంచ్ బెందాళం శ్రీరాం ప్రసాద్, ఎంపిటిసి డి.సతీష్, కవిటి ఎఇ నేతాజీ మండలంలో విద్యుత్ సరఫరాలో ఉన్న పలు సమస్యలను సిఎమ్‌డి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఇపిడిసిఎల్ ఎస్‌ఇ దైవప్రసాద్, పలాస డిఇజి ప్రసాదరావు, ఎడి డి.శ్రీనివాస్, సోంపేట, కంచిలి ఎఇలు జి.రామారావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.