మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి -నెల్లూరు : ప్రజలపై పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని 48వ డివిజన్ కుక్కల గుంట, మహాలక్ష్మి గుడి ప్రాంతాల్లో వామపక్ష నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి సిరాజ్ మాట్లాడారు. పెంచిన కరెంటు చార్జీలు తగ్గించే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ నుంచి నుండి16 తేదీ వరకు పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ నాయకులు యానాదయ్య, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు సునీల్, సిపిఐ నగర నాయకులు వాహనాల మధు, అజీజ్ అహ్మద్, గోపాల్, గౌస్, జలీల్, ముత్యాలు, రియాజ్, జమీర్, అబ్ద పాల్గొన్నారు.










