Apr 01,2022 15:13

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : నాలుగు రోడ్డు కూడలిలో జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాల హోరు....
ఇదేమీ రాజ్యం....ఇదేమి రాజ్యం..దొంగల రాజ్యం... దోపిడీ రాజ్యం.....నినాదాలతో విద్యుత్ ల్యాపులు దర్శనం..
ర్యాలీగా విద్యుత్ కార్యాలయం ముట్టడి చేశారు. 11 గంటలు కావస్తున్న విద్యుత్ కార్యాలయంలో సిబ్బంది లేక.... గుమ్మానికి వినతపత్రాన్ని టిడిపి కార్యకర్తలు అంటించారు.
మండల కేంద్రంలోని తెలుగుతమ్ముళ్లు  శుక్రవారం ఉదయం సుబ్బన్న కాంప్లెక్స్ నుండి నాలుగు రోడ్డు కూడలి వరకు టిడిపి కార్యకర్తలు ర్యాలీగా ప్రకార్డులు చేతబట్టి జాతీయ రహదారిపై బైఠాయించి సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నియెజక వర్గ తెలుగుయువత అధ్యక్షులు భువనచంద్ర గౌడు ప్రభుత్వ చేస్తున్న ప్రజా వ్యతిరేక పనుల పట్ల నినాదాలతో నిరసిస్తూ కూడలిలో కార్యకర్తల్లో జొస్ నింపారు. నినాదాలతో కార్యకర్తలు ఊపందుకున్నారు. అనంతరం ర్యాలీగా విద్యుత్ కార్యాలయం దగ్గరికి చేరుకొన్నారు. చేరుకొనే మునేపే కార్యాలయంలో సిబ్బంది లేకపోవడం చర్చనీయాంశం. తెలుగు తమ్ముళ్ల వినతిపత్రంను విద్యుత్ కార్యాలయ గుమ్మానికి అతికించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి  అధ్యక్షులు కిషోర్ గౌడు, జనరల్  సెక్రటరీ సుబ్బన్న, తెలుగుయువత అధ్యక్షులు భువన చంద్ర గౌడు,చిన్నపురం మధు, రాజేష్, దివాకర్ రెడ్డి, గోవిందాస్వామి, నాగరాజు, మనోహర్, రవి, శివన్న, సుబ్బారెడ్డి, కుమార్ ,రామచంద్ర, వెంగంవారిపల్లి కల్యాణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.