May 04,2023 21:52

మృతిచెందిన గొర్రెలు

       శింగనమల : అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలం లోని వెస్ట్‌ నరసాపురం గ్రామం సమీపంలో కెవి 11 విద్యుత్‌ లైన్‌ తగిలి 13 గొర్రెలు మృతిచెందిన ఘటన గురువారం చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామా నికి చెందిన కురుబ నారాయణ స్వామి గొర్రెలు మేపుకునేందుకు సమీప పొలాల్లోకి వెళ్లాడు. ఈనేపథ్యంలో గ్రామ సమీపంలో గత రాత్రి కురిసిన గాలివానకు కెవి 11 విద్యుత్‌ వైరు తెగి కింద పడ్డాయి. గమణించిన గొర్రెల కాపరి నారాయణస్వామి గొర్రెలను తీసుకెళ్లాడు. గొర్రెలు మేస్తూ విద్యుత్‌ వైర్లను తగలడంతో విద్యుదాఘానానికి గురై 13 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో దాదాపు రూ.1.5లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ గొర్రెలు మృతిచెందాయని, ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. కాగా రాత్రి పడిన విద్యుత్‌ వైర్లను విద్యుత్‌ అధికారులు ఎందుకు కనుగొనలేకపోయారనా స్థానికులు చెబుతున్నారు. గొర్రెలు కాకుండా మనుషులు ఎవరైనా వెళ్లి ఉంటే పరిస్థితి ఏంటని వాపోతు న్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.