Apr 25,2023 22:17

కాలుతున్న గడ్డివాములు

          పెద్దవడుగూరు : మండలంలోని చిన్నవడు గూరులో ఐదుగురు రైతులకు చెందిన పశుగ్రాసం విద్యుదాఘాతంతో మంగళ వారం పూర్తిగా దగ్ధమూంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన రైతులు సుదర్శన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, విజయభాస్కరరెడ్డి పశుగ్రాసాన్ని వాములుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈనేపథ్యంలో వాములపై వెళ్లిన విద్యుత్‌ తీగలు ఒకదానికి ఒకటి రాసుకుని నిప్పురవ్వలు చెలరేగాయి. ఆ నిప్పురవ్వలు గడ్డివాములపై పడటంతో మంటలు చెలరేగాయి. గమణించిన స్థానికులు ఆర్పేందుకు యత్నించారు. అయినా సాధ్యం కాకపోవడంతో గుంతకల్లు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేసి తెలిపారు. వారు వచ్చి ఆర్పేలోపు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. గతవారంలోనే గడ్డివాములను వేసుకున్నామని, అంతలోనే విద్యుదాఘాతంతో దగ్ధమయ్యాయని వాపోయారు. దీంతో రూ.15లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.