Aug 21,2023 00:23

విద్యుదాఘాతంతో ఏనుగు మృతి
ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి :
మండలంలోని నెల్లిపట్ల పంచాయతీ నల్లగుట్లపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ఏనుగు మతిచెందిన ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతానికి సమీపంలోని అయ్యప్పనాయుడు అనే రైతు పొలంలోని విద్యుత్‌ స్తంభాన్ని ఢకొీట్టడంతో కరెంట్‌ షాక్‌ తగిలి శనివారం రాత్రి ఓ ఏనుగు మరణించింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిపట్ల గ్రామం అటవీ ప్రాంతంలోని వ్యవసాయపొలాల వద్దకు తరచూ ఏనుగులు గుంపులుగా వచ్చి పంటలపై దాడి చేస్తుంటాయి. శనివారం రాత్రి ఏనుగులు గుంపు పంటపొలాలలో సంచరిస్తుండగా విద్యుత్‌ స్తంభాన్ని ఢకొీనడంతో కరెంట్‌ షాక్‌కు గురై ఏనుగు అక్కడికక్కడే మతి చెందింది. అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం సంఘటన స్థలాన్ని సందర్శించి ఏనుగుకు శవపరీక్ష చేసి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఇకనైనా అధికారులు స్పందించి ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో తగుచర్యలు తీసుకోవాలని రైతులు, చుట్టుపక్కల గ్రామస్తులు కోరుతున్నారు.