May 09,2023 21:58

పుస్తకాలను పరిశీలిస్తున్న డిఇఒ సాయిరాం

          ప్రజాశక్తి-గార్లదిన్నె   చదువుతోనే విద్యా ర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా విద్యాధికారి సాయిరాం సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి జగనన్న విద్యాకానుక స్టాక్‌ పాయింట్‌ను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. ఇంటర్‌, పదో తరగతి ఫెయిలైన విద్యార్థులు ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని ఈసారి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తారా చంద్రానాయక్‌, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ సతీష్‌, ఎంఆర్‌సి సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.