సిద్థార్థ కళాశాల ఛైర్మన్ అశోకరాజు
ఘనంగా జుబిలేషన్ వేడుకలు
ప్రజాశక్తి- నారాయణవనం: విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ అశోక్ రాజు అన్నారు. శుక్రవారం పుత్తూరు పట్టణంలోని సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని (ఫేర్‌వెల్ ఫంక్షన్)కళాశాల ఆడిటోరి యంలో ఘనంగా నిర్యాహించారు. ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన ఈ సభలో ఛైర్మన్ అశోకరాజు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజానికి ఇది వీడ్కోలు సభ కాదని, విద్యనభ్యసించి బాధ్యతలు తీసుకోవడానికి మాత్రమే వెళుతున్నారన్నారు. వారు ఎప్పుడూ సిద్ధార్థా కుటుంబ సభ్యులేనని హదయపుర్యకంగా భావిస్తున్నానన్నారు. అందరికీ ఉద్యోగావకాశాలు రావడమే కాక అత్యధిక ప్యాకేజీలతో స్థిరపడతారు కాబట్టి వారి వారి బాధ్యతలు ఎప్పుడు వినయంతో, అంకిత భావంతో, క్రమశిక్షణతో నిర్యాహిస్తూ ఉన్నత స్థానాలను అధిష్టించాలని కోరారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో కూడా రాణించాలన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థిని, విద్యార్థులకు, అధ్యాపకేతర సిబ్బందికి క్రికెట్ వాలీబాల్, త్రోబాల్, షటిల్, రన్నింగ్, షాట్ పుట్, మొదలకు పోటీలు నిర్యాహించారు. అనంతరం గెలుపొంది వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, జనార్దన్ రాజు, హెచ్ ఓడిలు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










