Oct 12,2022 22:35

మాట్లాడుతున్న మేయర్‌

చిత్తూరుఅర్బన్‌ : విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఇతర రంగాల లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీని వాసులు తెలిపారు. బుధవారం చిత్తూరు ప్రభుత్వ పి వి కె ఎన్‌ డిగ్రీ కళాశాల నందు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యం లో జిల్లా స్థాయి యువ ఉత్స వ్‌ కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి. జగన్‌ మోహన్‌ రెడ్డి విద్యతోనే పేదల కుటుంబాల ఆర్ధిక ఎదుగుదల ఉంటుం దని, కావున వారి ఇంట్లో పిల్లలు చదు వుకోవాలని వారికి కావలసిన అన్ని సౌక ర్యాలను అందించి ప్రోత్సహిస్తున్నారని, విద్యతో పాటు క్రీడల పై కూడా ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. అర్హత గల విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. నాడు - నేడు కార్యక్రమంతో కార్పొరేట్‌ హంగుల తో ప్రభుత్వ పాఠ శాలలను కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా తయారు చేస్తున్నారని తెలి పారు. నెహ్రు యువ కేంద్రం డిస్ట్రిక్ట్‌ యూత్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడు తూ జిల్లా స్థాయి యువ ఉత్సవ్‌లో భాగంగా గెలుపొంది న వారికి నగదు బహుమతి ఇవ్వడ మే కాక వారిని తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. గత సంవత్సరం నిర్వహించిన కవితా పోటీలలో గెలుపొందిన చిత్తూరు నగరానికి చెందిన కార్తిక్‌ అనే యువకుడు ఈ సంవత్సరం అక్టోబర్‌ 31న మన దేశ పార్లమెంట్‌ భవనంలో ప్రసంగించడం జరుగుతుందని, ఇది మన జిల్లాకు దక్కిన గౌరవమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఆనంద్‌ రెడ్డి, ఇతర అధ్యాపకులు, మాస్‌ ఎన్‌ జి ఓ ప్రెసిడెంట్‌ గుణశేఖర్‌ రెడ్డి పాల్గొ న్నారు.