Mar 23,2022 22:11

పిల్లలకు వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం


ప్రజాశక్తి-పుత్తూరుటౌన్‌:
బుధవారం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కళ్యాణపురం ఎంపీపీ పాఠశాలలో పిల్లలకు వ్యాక్సినేషన్‌ వేయించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రవిరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత కోవిడ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించడంతో తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ వేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు చెప్పి పిల్లలకు వ్యాకినేషన్‌ చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. 14 నుండి 18 సంవత్సరాలు వారు ఒక డోస్‌ వేసుకుని ఉండిపోతున్నారని, అలాంటి వారు కూడా రెండవ డోస్‌ వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు శివయ్య ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.