Sep 26,2023 00:16

విద్యార్థులు సమాజసేవకు సిద్ధంగా ఉండాలి

విద్యార్థులు సమాజసేవకు సిద్ధంగా ఉండాలి

ప్రజాశక్తి- కార్వేటినగరం: విద్యార్థులు సమాజసేవకు, దేశసేవకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.విజయులు రెడ్డి పేర్కొన్నారు. సోమవారం డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ధనంజయరెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులు సేవా దక్పథాన్ని అలవరుచుకోవాలని తెలిపారు. అలాగే పరిసరాలలో ప్లాస్టిక్‌ నివారణ, మొక్కలను పెంచడం, సామాజిక బాధ్యత కలిగి ఉండాలని కోరారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాచరచన పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు బాలసుబ్రమణ్యం ఆచారి, సీఎన్‌.లత, హరిబాబు, సుబ్బారావు, జోగి ప్రసాద్‌, కార్తీక్‌, భార్గవి, లావణ్య, స్వామి శివయ్య, గోపీ కష్ణ, శివరామకష్ణ, జేకేసి మెంటర్‌ లోకేశ్వర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
బంగారుపాళ్యం: మహాత్మా గాంధీని అనుసరించి నడుచుకోవాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గిరిబాబు అన్నారు. సోమవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ మురళి ఆధ్వర్యంలో సమావేశం జరిగినది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ కళాశాల నుంచి విద్యార్థులకు సేవాభావం కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్‌ఎస్‌ఎస్‌ను ప్రారంభించారని తెలిపారు. ఈనెల 24 నుండి అక్టోబర్‌ 2వ తేదీ వరకు వివిధ కార్యకలాపాలు చేపట్టి అక్టోబర్‌ 2న మహాత్మ గాంధీ జయంతిని నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కళాశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు వ్యర్థాలను తొలగించారు. కళాశాల అధ్యాపకులు శ్రీనివాసులు, పద్మజ, హసీనా, విద్యార్థులు పాల్గొన్నారు.