Oct 09,2023 21:00

ఫొటో : మాట్లాడుతున్న ఫారెన్‌ సర్వీస్‌ అధికారి జి.శ్రీనివాసులు

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : విద్యార్థులు క్రమశిక్షణ మెలిగినప్పుడే విజయం లభిస్తుందని ఫారెన్‌ సర్వీస్‌ అధికారి జి.శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆత్మకూరు బాలికోన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. లక్ష్య సాధన చేయాలంటే మనలో నైతికత ఉండాలని ధర్మం ఉండాలని ధైర్యంగా ఉండాలన్నారు. విద్యకు ఏదీ అవరోధం కాకూడదని తెలిపారు. నైతిక విలువలు ఉన్నప్పుడు మాత్రమే విద్యకు విలువ ఉంటుందని, అప్పుడు మాత్రమే విద్య రాణిస్తుందని తెలియజేశారు.
విద్యార్థులు మంచి మార్గంలో ఎలా వెళ్లాలనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయనను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరమ్మ, ఉపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి, జనార్దన్‌ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.