Jul 20,2023 22:00

ప్రజాశక్తి - ఉండి
           విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని కెవిపిఎస్‌ మండల కార్యదర్శి మాదాసి గోపి అన్నారు. మండలంలోని పాందువ్వ గ్రామంలో ఉండి కో-ఆపరేటివ్‌ రూరల్‌ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ మాదాసి వెంకటేశ్వరరావు వర్థంతి సందర్భంగా ఆయన కుమా రుడు కెవిపిఎస్‌ మండల కార్యదర్శి మాదాసి గోపి మం డల పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు, అంగన్‌వా డీలో చిన్నారులకు విద్యాసామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాదాసి గోపి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదుగుతారని ఆయన సూచించారు. విద్య వెలకట ్టలేనిదని, ఎవరూ దొంగలించలేనిదని, అటువంటి విద్యను నిర్లక్ష్యం చేయ కూడదని పాఠశాల ఉపాధ్యాయుడు దాగారపు గోపాలం అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ సత్యవతి, ఆర్‌ఎంపి డాక్టర్‌ ఎం.ప్రశాంత్‌, ఎం.రామయ్య, ఆశా కార్యకర్త పార్వతి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.