Jan 07,2023 20:36

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించాలి
జెవివి వ్యవస్థాపకులు డాక్టర్‌ వి. బ్రహ్మారెడ్డి
ప్రజాశక్తి- కార్వేటినగరం:
భావిభారత పౌరులైన నేటివిద్యార్థుల్లో శాస్త్రీయ దక్పధాన్ని పెంపొందించి విజ్ఞాన సమాజాన్ని నిర్మించాల్సిన భాద్యత ఉపాధ్యాయులపై ఉందని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్‌) ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించడం ద్వారా తెలుసుకోవాలనే తపన పెరుగుతుందని తద్వారా శాస్త్రీయతను పెపొందించవచ్చు అన్నారు. సామాజిక రుగ్మతలకు శాస్త్రీయ వైఖరిలే కారణమని ఉదాహరించారు. రానున్న రోజుల్లో కాబోవు ఉపాధ్యాయులుగా నవవిజ్ఞాన సమాజ నిర్మాణం మీచేతుల్లో ఉందని వివరించారు. తరగతి గదిని బోధనానుకూలంగా మార్చుకోవడం, విద్యార్ధులకు పుస్తక పాఠాలే కాకుండా జీవిత పాఠశాలను, మెళుకువలను నేర్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డైట్‌ ఇన్చార్జి ప్రిన్సిపాల్‌ చెంగల్‌ రాజు, ఆదర్శ పాఠశాల హెచ్‌ఎం గాజుల నాగేశ్వరరావు, ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయులు రెడ్డి, డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట రమణారెడ్డి, డైట్‌ అధ్యాపకులు ప్రభాకర్‌, వెంకటరమణ, శ్రీనివాసులురెడ్డి నిర్మల, సునీత, అనిత, వరలక్ష్మి, సూపరింటెండెంట్‌ కపావతి ఛాత్రోపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు.