Mar 21,2023 21:00

ప్రజాశక్తి - పెనుమంట్ర
ప్రతి విద్యార్థీ పౌష్టికాహార లోపాలను జయించాలంటే రాగిజావ చాలా అవసరమని ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి ) అన్నారు. సోమరాజు ఇల్లిందపర్రు పాఠశాలలో మంగళవారం గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సర్పంచి వనుం సూర్యనారాయణ ఆధ్వర్యంలో రాగిజావ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆయా గ్రామాలు ఎంపిటిసిలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ఆచంట : కార్పొరేట్‌ కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలతో ఉచితంగా విద్యనందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్షులు సుంకర సీతారామ్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని ఆచంట, కొడమంచిలి, పెదమల్లం, పెనుమంచిలి, ఆచంట వేమవరం, వల్లూరు తదితర గ్రామాల్లో ఆయా గ్రామ సర్పంచులు కోట సరోజినీ వెంకటేశ్వరరావు సుంకర సీతారాం, దిరిశాల విజయలక్ష్మి, గణేశుల శేషవాణి సుబ్బారావు, జక్కంశెట్టి చంటి, నేలపూడి బేబీ రామ్మోహన్‌రావు, ఎంపిడిఒ జగన్నాధరావు, విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు రక్తహీనత గురి కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసిలు, తహశీల్దార్‌ రాజలక్ష్మి పాల్గొన్నారు.
పాలకొల్లు : పాలకొల్లులోని జివిఎస్‌విఆర్‌ఎం మున్సిపల్‌ పాఠశాలతో పాటు వివిధ పాఠశాలల్లో జగనన్న గోరుముద్దలో భాగంగా రాగి జావ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వీవర్స్‌ కాలనీ పిఎంసి ఛైర్మన్‌ కొత్తల వెంకట కుమారి చేతుల మీదగా రాగి జావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ రాగిజావను ప్రతి విద్యార్థి తాగేటట్లు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పిఎంసి సభ్యులు, తల్లిదండ్రులు, హెచ్‌ఎం రాయపూడి భవానీ ప్రసాద్‌ పాల్గొన్నారు.
కాళ్ల : విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గోరుముద్ద పేరుతో రాగిజావ పంపిణీ కార్యక్రమం చేపట్టిందని జెడ్‌పిటిసి పచ్చిగోళ్ల సోమేశ్వరరావు అన్నారు. మండలంలోని కోపల్లె, కాళ్ల, దొడ్డనపూడి, కలవపూడి హైస్కూల్లో రాగిజావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వారంలో మూడుసార్లు పిల్లలకు రాగిజావ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పి.శిరీష విశ్వనాధరాజు, ప్రధానోపాధ్యాయులు కె.సత్యనారాయణ మూర్తి, కె.నిర్మలాదేవి, ఇందిర, గాదిరాజు వెంకట రామకృష్ణంరాజు పాల్గొన్నారు.
ఉండి : మండలంలోని అన్ని పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఉప్పులూరులోని యర్రా చంద్రరావు, ఆండాలమ్మ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కొల్లి సాయిరాం ఆధ్వర్యంలో విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి నిమ్మల కేశవ్‌ కుమార్‌ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో చెన్నకేశవ స్వామి ఆలయ ఛైర్మన్‌ యర్రా సుబ్బారావు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పెంటపాడు : రాగి జావ పంపిణీ కార్యక్రమం ఎంపిపి దాసరి హైమావతి మంగళవారం స్థానిక ప్రభుత్వ పోస్ట్‌ బేసిక్‌ స్కూల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడారు. వారంలో మూడు రోజులు రాగిజావ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి తాడేపల్లి సూర్యకళ, తహశీల్దార్‌ జివి.శేషగిరి, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ సత్యనారాయణ పాల్గొన్నారు.
పెనుగొండ: దేవ, ములపర్రు, ఇలపర్రు తదిరత గ్రామాల్లోని పాఠశాల్ల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవ సర్పంచి ఎన్‌.సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో ఇలపర్రు సర్పంచి దండు పద్మావతి, ఉప సర్పంచి సాక సుబ్రహ్మణ్యం, గుడాల చిన రామకృష్ణ పాల్గొన్నారు.
ఆకివీడు : తమ ప్రభుత్వం విద్యకు, విద్యార్థుళకు విద్యార్థుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని జెడ్‌పిటిసి వేగేశ్న వెంకటరాజు (ఎండగండి శీను) అన్నారు. విద్యార్థులకు రాగి జావా పంపిణీ కార్యక్రమం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని చినకాపురం జిల్లా పరిషత్‌ హైస్కూల్లో కార్యక్రమాన్ని జెడ్‌పిటిసి వెంకటరాజు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిపి రాజ్యలక్ష్మి, వైసిపి నాయకులు అన్నవరం, పార్టీ మండల కార్యదర్శి బి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
పాలకోడేరు : జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమని మండల పరిషత్‌ అధ్యక్షులు భూపతి రాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు), కుముదవల్లి సర్పంచి భూపతిరాజు వంశీకృష్ణంరాజు అన్నారు. కుముదవల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్త్తోందన్నారు. విస్సాకోడేరు, గొరగనమూడి, శృంగవృక్షం గ్రామాల్లో సర్పంచులు బొల్ల శ్రీనివాస్‌, గొట్టుముక్కల వెంకట శివాజీరాజు, జంగం సూరిబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో పొన్నమండ బాలకృష్ణ, చెల్లబోయిన పాపారావు, నరేష్‌, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : కోడిగుడ్డు, చిక్కీలు, రాగిజావ వంటి బలమైన పౌష్టికాహారం అందించడం ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని తాడేపల్లి గ్రామ సర్పంచి పోతుల అన్నవరం అన్నారు. తాడేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని సొసైటీ ప్రెసిడెంట్‌ పరిమి తులశీదాస్‌తో కలిసి అన్నవరం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్‌.రవిచంద్ర, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ సురేష్‌కుమార్‌, ఉపాధ్యాయులు కెవిఎస్‌.రామాంజనేయులు, మేరీ పుష్ప పాల్గొన్నారు.