Mar 08,2022 16:56

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఎల్ఐసి యూనియన్, ఐద్వా ఆధ్వర్యంలో పుత్తూరు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు 125. మందికి పరీక్ష సామాగ్రి ని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి ఇ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎల్ఐసి యూనియన్ సామాజిక కార్యక్రమాలకు మహిళా అభ్యున్నతి ఎల్లవేళల ముందు ఉంటుందని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతా కుమారి మాట్లాడుతూ ఎల్ఐసి యూనియన్ సహకారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమీల. కళ్యాణి. మహా వాణి. ఉపాధ్యాయనులు పుష్ప. ఇతర ఉపాధ్యాయులు ఎల్ఐసి యూనియన్ నాయకులు షణ్ముగం వెంకటేశ్వర్లు , రమేష్,  దస్తగిరి పాల్గొన్నారు.