Apr 24,2023 20:59

వీరవాసరం:దాత సహకారంతో విద్యార్థులకు భోజనం ప్లేట్లు సమకూరాయి. వీరవల్లిపాలెం సర్పంచి శీలబోయిన పద్మకుమారి తన భర్త శీలబోయిన పాటేశ్వ రరావు జ్ఞాపకార్థం ఆయన పుట్టిన రోజును పురష్కరించుకుని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ విద్యార్థులకు సోమవారం 80 ప్లేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శీలబోయిన నిరంజన్‌, ప్రధానోపాధ్యాయుడు నడపన దుర్గారావు, పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ శీలబోయిన పవన్‌కుమార్‌, ఉపసర్పంచి జి.రాంప్రాసాద్‌, మాజీ సర్పంచి కె.ఈశ్వరి, ప్రసాద్‌ పాల్గొన్నారు.