అదశ్యమైన విద్యార్థిని మౌనిక
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్:
ఎస్సై చంద్రమోహన్ వివరాలు మేరకు మదనపల్లి మండలం, కోళ్లబయలు పంచాయతీ, వైయస్సార్ కాలనీకి చెందిన జి.గోపాల్ కుమార్తె జి. మౌనిక(19) స్థానిక కోమటివాణి చెరువు సమీపంలో ఉన్న ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 19న కళాశాలకు వెళ్ళిన విద్యార్థిని తిరిగి ఇంటికి తిరిగిరాకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు బంధువుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విద్యార్థిని తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు అదశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. విద్యార్థిని ఆచూకీ తెలిసినవారు 9440796741 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.










