Mar 11,2022 22:00

మాట్లాడుతున్న ఎంపీడీవో చిన్నరెడ్డప్ప



ప్రజాశకి-కార్వేటినగరం : శుక్రవారం మండల పరిధిలోని ఆర్కేవీబీ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా చేపట్టే కార్యక్రమాలు అభినందనీయమన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయులురెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామింగ్‌ అధికారి డాక్టర్‌ ధనంజయులురెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత, మొక్కలను నాటడం, జాతీయ భావాల పట్ల గ్రామీణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఆర్కేవీబీ పేట సర్పంచ్‌ దివ్య మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులు చేసే సేవలు గ్రామాభివద్ధికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం స్వరూప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.