Aug 12,2023 22:17

సంఘీభావం తెలుపుతున్న ఫ్యాప్టో నాయకులు

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ ఎస్‌.సిరాజుద్దీన్‌, సెట్రకరీ జనరల్‌ లింగమూర్తి, నాయకులు కోటేశ్వరప్ప, గోవిందరాజు డిమాండ్‌ చేశారు. శనివారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యారంగం సంక్షోభంలో పడిందన్నారు. ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం ప్రయివేట్‌ పాఠశాలలకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేసిన జాతీయ విద్యా విధానం, 3,4,5 తరగతుల విలీనంతో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక తరగతి గదులు వెలవెలబోతున్నాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులను భయాందోళనలకు గురి చేస్తున్నార న్నారు. వెంటనే విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆం దోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయ కులు రఘురామ్‌రెడ్డి, ఎన్‌ రమణారెడ్డి, నరసింహులు, కులశేఖర్‌ రెడ్డి, సూర్యుడు, చంద్రశేఖర్‌, వెంకటేష్‌, పురుషోత్తం, ఎస్‌వివి.రమణయ్య, శ్రీనివాస్‌రెడ్డి, జయరామిరెడ్డి, పెద్దన్న, వెంకటరత్నం, ఎస్‌.రామాంజనేయులు, బాల మురళి, రవీంద్ర, గోపాల్‌రెడ్డి, కృష్ణమూర్తి, శంకరమూర్తి, రాజశేఖర్‌, కృష్ణమోహన్‌, జావేద్‌, ఫణిభూషణ్‌, నాగరాజు, శంకర్‌, జార్జ్‌, అహమ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.