Nov 06,2022 22:29

ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారి విజయేంద్రరావు

విద్యారంగ ప్రతిష్టతకు కృషి
నాడు- నేడుతో పాఠశాలల రూపురేఖల్లో మార్పు
ఇన్‌ఛార్జి జిల్లా విద్యాశాఖాధికారి విజయేంద్రరావు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

నాడు- నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్లో అనేక మార్పులొచ్చాయని ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారి విజయేంద్రరావు అన్నారు. ప్రజాశక్తితో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత మాటాల్లో చెప్పలేమన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి పిల్లల అభివృద్ధి కోసం ఆర్థిక చేయూతను అందించేలా గోరుముద్ద, అమ్మఒడి, జగనన్న కానుక వంటి పధకాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రత్యేకశ్రద్దతో ప్రాధమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరిగిందని, నేటి పరిస్థితులకు అనుగుణంగా విద్యాబోధనలో అనేక మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. ఫలితంగా ప్రభుత్వబడుల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయుల్లో ప్రతిభను పెంచేలా శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ విద్యావ్యవస్థ మరింత ప్రతిష్టం కానుందని అన్నారు. నాడు-నేడు మొదటి, రెండో విడతలో జిల్లాలోని అనేక పాఠశాలలు అధునీకరించడం జరిగిందన్నారు. పాఠశాల అభివృద్ధి కమిటిల సలహాల మేరకు ప్రహరిగోడలు, మరగుదొడ్లు, ఫ్టోర్‌ వేయడం వంటి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాడు- నేడు 297పాఠశాలల ఆదునీకరణ పనులు జరుగుతున్నాయని, నాడు- నేడు మూడో విడతలో మరిన్ని పాఠశాలలు కొత్త ఆధునీకరించబడుతాయని అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల ఫలితంగా ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతం అవుతోందని తెలిపారు.
ప్రజాశక్తి : జగనన్న అమ్మఒడి 2020-21 విద్యాసంవత్సరంలో ఎంత మంది వచ్చింది?
డిఇఒ: జిల్లాలో మొత్తం విద్యార్థులు 6,77,524 ఉన్నారు. వీరిలో అర్హులుగా 5,59,289 మందిని గుర్తించి అమ్మఒడి వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. జిల్లాలో రూ.527 కోట్లు అమ్మఒడి పధకం క్రింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేశారు.
ప్రజాశక్తి : ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ ఈ విద్యాసంవత్సరంలో ఎలా జరిగింది?
డిఇఒ: ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోని 4,828 పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థులకు 45,10,469 పాఠ్యపుస్తకాల అవసరం 17,63,950 పుస్తకాలు పంపిణీ చేశాం. 2,746, 519 పుస్తకాలు ప్రింటింగ్‌ కావాలి.
ప్రజాశక్తి : మోడల్‌ స్కూల్స్‌ నిర్వహణ ఎలా ఉంది?
డిఇఒ: జిల్లాలో 19 ఆదర్శ పాఠశాలల్లో మొత్తం ఆరు నుండీ ఇంటర్‌ వరకు 10,825 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 16 బాలికల వసతిగృహాలలో 1,600 బాలికులు వసతి పొందుతున్నారు. రూ.54కోట్లలో 18 పాఠశాలలకు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నాం. నాడు- నేడు మొదటిదశలో 18 ఆదర్శ పాఠశాలలకు రూ.6.38 కోట్లు మంజురు కాగా అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయడం జరిగింది.
ప్రజాశక్తి : జగనన్న గోరుమద్దు పధకం అమలు తీరు ఎలా ఉంది...?
డిఇఒ: జిల్లాలో 4,828 ప్రాధమిక, ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో 3,64,446 మంది విద్యార్థులు జగనన్న గోరుముద్ద పధకం ద్వారా మధ్యహ్న భోజనం లబ్ది పొందుతున్నారు. వారానికి ఆరు కోడిగుడ్లు, 3 చిక్కీలు సరఫరా చేయబడుతోంది. జిల్లాలోని 8,355 స్వయం సహాయ సంఘాల మహిళలు గోరుముద్ద పధకంలో మద్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో రూ. 55.74కోట్లు గోరుముద్ద పధకంలో విద్యార్థులకు భోజనం అందిస్తున్న వంటమ్మల ఖాతాల్లో జమ చేశారు. వీరి గౌరవేతనం 2021మే వరకు అందించాం. ప్రాధమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 4,933మంది ఆయమ్మలకు నెలకు రూ.6వేలు చొప్పున గౌరవ వేతనం ఆగస్టు 201 నుంచి ఫిబ్రవరి 2022 వరకు రూ.16.91కోట్లు వారిబ్యాంకు ఖాతాల్లో జమచేశారు.