బహుమతులు ఇస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-పుత్తూరుటౌన్:
సుప్రీం కోర్టు ఎఓఆర్ శ్రేష్ట కొప్పేడు గ్రామానికి చెందిన ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు అందరికీ విద్యాపరికరాలు, నోటు పుస్తకాలు అందించారు. అదే గ్రామానికి చెందిన దళిత వాడలోని విద్యార్థులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్రీడల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయవాది, ఏపి జనసేవ లీగల్ ఎయిడ్ అండ్ హ్యూమన్ వెల్పర్ సొసైటీ అధ్యక్షుడు రాగసందేశ్, కార్యదర్శి, జూనియర్ న్యాయవాది ప్రేమ్‌కుమార్, పి.గిరిబాబు, ఎ.మురళి, టిఎస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు లతీఫ్ ఖాన్, ఉపాధ్యక్షుడు మురళి, హైకోర్టు న్యాయవాది విదురుడు, సొసైటీ సభ్యులు పురుషోత్తం, చలపతి గౌతమ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










