Feb 19,2022 22:31

కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పిస్తున్న ఎంపీపీ లతాబాలాజీ.

ప్రజాశక్తి- కార్వేటినగరం :విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ లతాబాలాజీ అన్నారు. శనివారం ఆర్కేఎస్సార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న కెరీర్‌ గైడెన్స్‌ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల బలోపేతానికి అహర్నిశలు కషి చేస్తుందన్నారు. ప్రతి విద్యార్థి తమ మేధాశక్తితో ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే లక్ష్యంగా విద్యనభ్యసించాలన్నారు. 10వ తరగతి అనంతరం తమ లక్ష్యాన్ని ఎంచుకోవడంలో తప్పటడుగులు వేస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం 9,10 నుంచే విద్యార్థులు తమ అభిలాష, ఇతరులకు అనువైన కోర్సులను ఎంపిక చేసుకునే విధంగా ప్రభుత్వం కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. కెరీర్‌ గైడెన్స్‌ పథకాలను సద్వినియోగం చేసుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పిలుపునిచ్చారు. అనంతరం హెచ్‌ఎం వైవి వసుమతి దేవి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం విద్యాబోధనలో సమూల మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్‌ మోహన కుమారి, ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు