ప్రజాశక్తి- పలమనేరు: పలమనేరు రూరల్ మండలం మొరం దగ్గర గోవర్ధనామ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫైర్ ప్రొటెక్షన్ లోని విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకుని విదేశాల్లో ఉద్యోగానికి 11 మంది ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో తొమ్మిది మంది టెక్నీషియన్స్‌గా రూ.3.2 లక్షల ప్యాకేజీకి, ఇద్దరు సూపర్వైజర్లుగా రూ.4 లక్షల ప్యాకేజీతో ఎన్నికయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు రైసింగ్ సైన్ గ్రూప్స్ ఎండి రవి సుబ్రహ్మణ్యం ఉచితంగా వీసాలు అందజేస్తామ న్నారు. ఇన్‌స్టిట్యూట్ స్థాపించిన మొదటి సారి కోర్స్ కంప్లీట్ చేసుకుని 11 మంది విద్యార్థుల ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవేగాక రాబోయే కాలంలో మరిన్ని మల్టీనేషనల్ కంపెనీల ద్వారా విద్యార్థులకు క్యాంపస్ సెలెక్షన్ ద్వారా ఉద్యోగకల్పన చేస్తామని తెలిపారు.










