విభిన్న ప్రతిభావంతులకు సమాన హక్కులు
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
విభిన్న ప్రతిభావంతులు నేడు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారని చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు తెలిపారు. అందరితో సమానంగా వీరికి హక్కులు కల్పించాలన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవన్ లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎం ఎల్ ఏ పాటు చిత్తూరు నగర మేయర్ అముద, జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, జెడ్ పి వైస్ చైర్మన్ రమ్య, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవద్ధుల సంక్షేమ శాఖ ఏడి ఎ.వై. శ్రీనివాస్, బి.సి, ఎస్.సి కార్పొరేషన్ ఈడి లు సుబ్రహ్మణ్యం, నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అంగ వైకల్యమును తుల్యముగా భావించి మనో నిబ్బరంతో అన్ని రంగాలల్లోనూ రాణిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల పాదయాత్రలో విభిన్న ప్రతిభావంతులు తోడుగా నడిచారని,వీరి అభిమానాన్ని మరచి పోరని, వీరి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నదన్నారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత మూడున్నర సంవత్సరాల కాలంలో విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన అన్ని రకాల సేవలను అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దష్టికి తీసుకెళ్ళి కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేయడానికి కషి చేస్తామని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు కార్య సాధన యందు దఢ సంకల్పంతో ఉంటారని తెలిపారు. వీరి అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రతి నెలా ఒకటవ తేదినే సామాజిక పించన్ అందిస్తున్నామన్నారు.
జిల్లాలో సాధారణ విభిన్న ప్రతిభావంతులకు నెలకు రూ.3000 చొప్పున, పక్షవాతంతో బాధపడుతున్న వారికి నెలకు రూ.5వేలు, తలసేమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులతో భాదపడుతున్న వారికి నెలకు రూ.10వేల చొప్పున పించన్ అందిస్తున్నామన్నారు. స్వయం ఉపాధి పథకం ద్వారా 2022-23 సం. లో 50 వేల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు 52 మందికి వివిధ రకాలైన ఉపాధి కొరకు మొత్తం రూ.1.07 కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు గహాలను మంజూరు చేశామన్నారు. 70 శాతం శారీరక వికలత్వం కలిగిన వారికి రిట్రో ఫీటేడ్ మోటార్ వాహనాల కొరకు ప్రభుత్వ నిబంధలనలను సరళతరము చేసి రూ.12 లక్షల విలువ చేసే 10 మూడు చక్రాల మోటార్ సైకిల్ లు, రూ.1.05 లక్షల విలువ చేసే మూడు ల్యాప్ ట్యాప్ లు, రూ.45 వేలు విలువ చేసే మూడు టచ్ ఫోన్ లు, స్వయం ఉపాధి పథకం కింద 10 మందికి రూ.23 లక్షల మంజూరు పత్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించడం జరిగిందని తెలిపారు. ఇంకనూ అవసరమున్న వారికి భవిష్యత్తులో అందించే విధంగా కషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ గత మూడు సంవత్సరములలో బ్యాటరీ ట్రై సైకిల్ లు, ల్యాప్ టాప్, టచ్ ఫోన్, మూడు చక్రాల సైకిల్ లు, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, కత్రిమ అవయవాలు సమకూర్చుటకు మొత్తం 2,080 మంది లబ్దిదారులకు రూ.2.95 కోట్లు ఖర్చు చేశామన్నారు. నగర మేయర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు అందరితో సమానంగా అన్ని హక్కులను కల్పించడం జరిగిందని తెలిపారు. వీరు విద్యారంగంలో బాగా రాణిస్తున్నారని తెలిపారు. సదరం సర్టిఫికేట్లను అందించడం జరుగుతున్నదని తెలిపారు.










