ప్రజాశక్తి - కాళ్ల
విఆర్‌ఒల సంఘం మండల నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం ఏకగ్రీవమైంది. తహశీల్దార్ కార్యాలయంలో కెడిఎస్ కెనడీ (విఆర్‌ఒ డివిజన్ అధ్యక్షులు) అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. సంఘం అధ్యక్షులుగా నిట్టాల సీతారాం, ఉపాధ్యక్షులుగా గుర్రం చిట్టిబాబు, కార్యదర్శిగా కోమట సుబ్రహ్మణ్యం, ట్రెజరర్‌గా బి.రాజేశ్, జాయింట్ ట్రెజరర్‌గా ఎం.ప్రశాంత్ బాబు ఎన్నికయ్యారు.










