ప్రజాశక్తి - వీరవాసరం
విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విఆర్‌ఎలు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. డిఎ రికవరీ ఆపాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ఈ నిరసనలో డి.ప్రదీప్, కె.సురేష్, పి.దుర్గారావు, జక్కరం, డి.శ్రీను పాల్గొన్నారు.
పోడూరు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా విఆర్‌ఎల సంఘం మండల కార్యదర్శి కడిమి ఏసు మాట్లాడుతూ సిఎం జగన్ పాదయాత్రలో విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో కోశాధికారి నల్లి సుమన్, ఉపాధ్యక్షుడు కె.సూర్యనారాయణ, విఆర్‌ఎలు పాల్గొన్నారు.
ఆచంట : గ్రామ సేవకుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విఆర్‌ఎల సంఘం (సిఐటియు అనుబంధం) మండల కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న దీక్షలను తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ సేవకుల సీనియర్ నాయకులు తలుపూరి ముత్యాలరావు గురువారం ప్రారంభించారు. ఈ దీక్షలకు సిపిఎం మండల కమిటీ సభ్యులు సిర్రా నర్సింహమూర్తి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్‌విఎన్.శర్మ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ విఆర్‌ఎలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీక్షలో విఆర్‌ఎల సంఘం నేతలు చెరుకొండ సాయిరాం, వి.వెంకటేశ్వరరావు, ఉందుర్తి పెదరెడ్డి, ఆచంట సత్యన్నారాయణ, కొడమంచిలి పద్మారావు, షేక్ సంసుద్దీన్, నారిన వెంకటేశ్వరరావు, కొప్పర్తి సత్యన్నారాయణ పాల్గొన్నారు.
ఉండి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షుడు పిల్లి సుబ్బారావు అన్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద రెండు రోజుల నిరసన దీక్షలో భాగంగా ఇన్‌ఛార్జి తహశీల్దార్ ఎస్.వీరాస్వామి నాయుడుకు వినతిపత్రం అందజేశారు. దీక్షలకు సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు ధనికొండ శ్రీనివాస్, కొట్టాడ వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. కార్యక్రమంలో విఆర్‌ఎలు ఎం.నాగరాజు, ముత్యాలపల్లి గణేష్, సయ్యద్ హజర్ మోహిద్దీన్, కొడవర్తి శ్రీను పాల్గొన్నారు.
పాలకోడేరు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షుడు నాని మాట్లాడారు. ఈ ధర్నాలో వైస్ ప్రెసిడెంట్ రోబీయమ్మ, సెక్రటరీ కింతాడ రవి, సలహాదారుడు కడిమి రవి, విఆర్‌ఎలు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ : విఆర్‌ఎలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు పెద్దిరాజు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావూరి మాణిక్యాలరావు, సుబ్బారావు, అమలాపురం రాజు, పనసరావు పాల్గొన్నారు.
మొగల్తూరు : తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. అనంతరం తహశీల్దార్ జి.అనితకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం అధ్యక్షులు కోటిపల్లి వేణు, చంటిబాబు, గణేష్, కృష్ణ, ప్రసాద్, సత్యనారాయణ పాల్గొన్నారు.
పాలకొల్లు : విఆర్‌ఎలకు పేస్కేల్ అమలు చేయాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మండల సివిల్ సప్లై డిటి సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షులు రాపాక నరేష్, సెక్రటరీ టి.గోవింద్, ట్రెజరర్ టి.వెంకటేశ్వరరావు, మర్రే వరప్రసాద్, డి. నాగేశ్వరరావు, శివకుమార్ పాల్గొన్నారు.
తణుకురూరల్ : విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్డగర్ల అజయకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌ఎల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అజయకుమారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం నాయకులు కౌరు వెంకటేశ్వర్లు, విఆర్‌ఎల సంఘం అధ్యక్షులు ఎం.బలరాం, ఎం.ధర్మారావు, ఎ.సరస్వతి, ఎం.జ్యోతి, ఎన్.నాగబాబు, కె.పోసిబాబు పాల్గొన్నారు.
పెనుగొండ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్‌లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్‌ఎల సంఘం అధ్యక్షులు బొంగ గణేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు వెంకట్రావు, వెంకటేశ్వరరావు, విఆర్‌ఎలు పాల్గొన్నారు.










