May 08,2023 20:44

ప్రజాశక్తి - కాళ్ల
సంఘ సేవకుడు, దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు దాట్ల వెంకట రామరాజుకు డాక్టరేట్‌ రావడం అభినందనీయమని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ బహుజన సమైక్య వ్యవస్థాపకులు సోడదాసి గంగయ్య అన్నారు. సోమవారం కాళ్లకూరులో డాక్టరేట్‌ దాట్ల వెంకట్రామరాజుకు సత్కార సభ నిర్వహించారు. కాళ్లకూరు గ్రామానికి దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ అధినేత దాట్ల వెంకట్రామరాజు సేవలను గుర్తించిన బెంగుళూరుకు చెందిన ఆసియా వేదిక్‌ కల్చర్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఇటీవల డాక్టరేట్‌ అందించిందన్నారు. అనంతరం వెంకట్రామరాజును ఘనంగా సన్మానించారు. వెంకట్రామరాజు సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుడేసే అనిల్‌ కుమార్‌, మండల అధ్యక్షులు కొనా రంజీత్‌, పాస్టర్‌ అహరోను, గాతల సందీప్‌ పాల్గొన్నారు.