ప్రజాశక్తి - కాళ్ల
కాళ్లకూరు గ్రామానికి దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్టు అధినేత దాట్ల వెంకట్రా మరాజుకు బెంగుళూరుకు చెందిన ఆసియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ శనివారం డాక్టరేట్ ప్రదానం చేసింది. కాళ్లకూరులో దాట్ల శ్రీదేవి ట్రస్టు ద్వారా పేద ప్రజలకు, విద్యార్థులకు ఆర్థిక సహకారం, వేసవిలో చలివేంద్రాలు, మోక్షధామం వివిధ అభివృద్ధి పనులకు గాను ఆయనను డాక్టరేట్ వరించింది. బెంగుళూరులో ఆసియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ ఫౌండర్ జినురామశర్మ స్వామీజీ, మాజీ ఎంఎల్‌ఎ కెఎ.మనోకరణ్ చేతుల మీదుగా వెంకట్రామరాజు డాక్టరేట్ అందుకున్నారు. డాక్టరేట్ అందుకోవడం పట్ల కాళ్లకూరు గ్రామస్తులు వెంకట్రామరాజును అభినందించారు.










