మాట్లాడుతున్న నాయకులు
వెంకటంపేటలో జగనన్న సురక్ష
ప్రజాశక్తి-ఉదయగిరి:దుత్తలూరు మండలం, వెంకటంపేట గ్రామ సచివాలయ పరిధిలో వైసిపి మండల అధ్యక్షుడు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గురువారం
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుండి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తూ, ఇప్పటికే ప్రాథమిక పరీక్షలతో ఆరోగ్య సమస్యలను గుర్తిస్తున్న జగనన్న ప్రభుత్వమన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో నందిపాడు సొసైటీ చైర్మన్ మండ్ల శివ, సొసైటీ డైరెక్టర్ ఉండేలా దశరథరమిరెడ్డి,మండల జేఏసీ కన్వీనర్ అన్నం రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు ఎల్పీ మాలకొండారెడ్డి, ఎంపీడీఓ ఎం.సాయి ప్రసాద్, సర్పంచ్ పేరుమళ్ల సుజాత, హెల్త్ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










