Sep 21,2023 22:23

వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి : సిఐటియు
ప్రజాశక్తి- పలమనేరు: ప
లమనేరు ఏరియా ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకుగా పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న మూడునెలల జీతాన్ని వెంటనే చెల్లించాలని సిఐటియు పట్టణ అధ్యక్షకార్యదర్శులు గిరిధర్‌ గుప్తా, సుబ్రహ్మణ్యంలు డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా గురువారం పారిశుధ్య కార్మికులతో కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్‌ఎంకు అందించారు. వారు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు ఎన్నోఏళ్ల నుంచి ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తూ హాస్పటల్‌కి వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ బాధ్యతలను నెరవేరుస్తున్నారని తెలిపారు. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. సకాలంలో జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దెలు, నిత్యావసర సరుకులు తీసుకోలేక పోతున్నారని, బయట వ్యక్తుల చేత అధిక వడ్డీలు తెచ్చి నరకయాతన అనుభవిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జయంతి, రాజా, సుధాకర్‌, కార్మికులు లోకేష్‌, జయమ్మ, బుజ్జమ్మ,, శ్యామల, నారాయణమ్మ, కష్ణమ్మ, గీత పాల్గొన్నారు.