ప్రజాశక్తి - క్యాంపస్ :
శనివారం మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ 82 ఓవర్ హెడ్‌ట్యాంక్‌లు, 80 బోర్లు, 80 మోటార్లు, పంచాయతీల్లో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇచ్చే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. మండల పరిధిలో 34 గ్రామ పంచాయతీలలో సమస్యల పరిష్కారానికై అంశాల వారీగా.... ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు తదితర అంశాలను సభ్యులు ఎంపీపీ దష్టికి తీసుకొచ్చారు. సమస్యలను తక్షణం పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చోరవ చూపాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగ్గా చేపట్టాలన్నారు. ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వివరించారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ వెంకటనారాయణ, జెడ్పీటీసీ రత్నమ్మ, వైస్ ఎంపీపీలు మాధవరెడ్డి, యశోద, సింగిల్ విండో చైర్మెన్ హేమాద్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










