ప్రజాశక్తి - పాలకోడేరు
వేండ్ర ప్రాథమిక పాఠశాలలో 1983 - 84లో ఐదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా ఉగాది పండుగను పరిష్కరించుకుని కలుసుకున్నారు. తాము చదువుకున్న పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకోవడం, చదువునేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకోవడం జీవితంలో మర్చిపోలేమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు మాట్లాడుకుని, హుషారుగా ఆడి పాడారు. సహపంక్తి భోజనాలు చేసి, స్వీయ చిత్రాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎడి కృష్ణ, డివి సుబ్బరాజు, పిహెచ్ విశ్వనాథరాజు, కె.విజరుకుమార్, ఎం.రమేష్‌రాజు, జె.శ్రీనివాసరావు, డిహెచ్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.










