వేగంగా రోడ్లు అభివృద్ధి : ఎమ్మెల్యే ఆరణి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల అభివద్ధి వేగంగా చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. శనివారం ఎమ్మెల్యే, నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ, నగరపాలక ఇంజనీరింగ్, ప్రణాళిక విభాగం అధికారులు పలు రోడ్లను పరిశీలించారు. లక్ష్మీనగర్‌కాలనీ పరిధిలో భాస్కర్ హోటల్ నుంచి ఎంజీఆర్ విగ్రహం వద్ద ఉన్న రోడ్డు అభివద్ధి పనులపై అధికారులకు సూచనలు చేశారు. ఈరోడ్డు అభివద్ధి కోసం టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు నగరంలోని పలు రోడ్లను టిఓడి (ట్రాన్సిస్ట్ ఓరియెంటేషన్ డెవలప్మెంట్) కారిడార్ అభివద్ధి చేయడానికి నగరపాలక అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. గాంధీ సర్కిల్ నుండి భాస్కర హోటల్ వరకు, ఎమ్మెస్సార్ సర్కిల్ నుంచి దర్గా సర్కిల్ వరకు, కోర్టు డౌన్ నుండి సంతపేట వరకు ఈ తరహా రోడ్ల అభివద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో ఎంఈ ధనలక్ష్మీ, ఎసీపీ రామకష్ణుడు, డీఈ రమణ, టీపీఎస్ శారద, ఇతర అధికారులు పాల్గొన్నారు.










