ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : బైరెడ్డిపల్లెలో మహతి క్షేత్రం మరియు కళాతరంగిణి సంస్థ వారి అధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ సందర్బంగా మహతి క్షేత్రం చైర్మన్ నాగరాజు సౌజన్యంతో నిర్వాహకులు శాంతమ్మ, బుజ్జి, నాని, శ్రీనివాసులు , కళాతరంగిణి వ్యవస్థాపకులు రాజేష్ బాబు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి ఆత్మీయ పురస్కారాలందజేసి ఘనంగా సత్కరించారు. వేదపండితులు తిప్పయ్యచార్యులు , అర్చకులు మునివీరయ్య , రిటైర్డ్ హెచ్ ఎం పురుషోత్తం, తెలుగు పండిట్ రామ్మోహన్, రచయిత్రి విమల, పీ ఈ టీ సంధ్యారాణి , వ్యవసాయ సలహాదారులు రమేష్, శేషు, రామ్, సర్వేయర్ నాయక్ , పురోహితులు సుబ్రమణ్యశర్మ, సీనియర్ ఆర్టిస్టులు మస్తాన్, రాజన్న, సిద్ధారెడ్డి, వ్యాపారవేత్త గౌస్, సాదిక్ , జాకీర్, జహీర్ తదితరులు సన్మానం అందుకున్నవారిలో ఉన్నారు. అనంతరం కళాతరంగిణి విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి .మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించి, సమాజాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మహతి క్షేత్రం చైర్మన్ నాగరాజు తెలిపారు .










