Feb 25,2022 22:54

అఖిలపక్ష నాయకులు, రైతులు విద్యార్థులు, మహిళలు ర్యాలీ


రోజురోజుకు పెరుగుతున్న నిరసనలు

ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి
ప్రజాశక్తి- వెదురుకుప్పం: వెదురుకుప్పం మండలంను బాలాజీ జిల్లాలో చేర్చాలని మండలంలోని బజార్‌ వీధుల్లో అఖిలపక్ష నాయకులు, రైతులు విద్యార్థులు, మహిళలు ర్యాలీ చేశారు. అనంతరం చిత్తూరు జిల్లా వద్దు, బాలాజీ జిల్లా ముద్దు, నినాదాలు చేస్తూ మొరవ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మోహన మురళి మాట్లాడుతూ ఇప్పటికైనా స్థానిక ప్రజలు ఆకాంక్షలను, సెంటిమెంట్ను, సమస్యలను దష్టిలో ఉంచుకొని మండలాన్ని బాలాజీ జిల్లాలో కలపడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన మురళి, బియం రవి, రాజేందర్‌ రెడ్డి, ప్రేమ్‌ కుమార్‌ రెడ్డి, వరప్రసాద్‌, కార్తీక్‌, మాజీ సర్పంచ్‌ మొగిలయ్య, మాజీ ఎంపిటిసి రాజయ్య, ప్రసాద్‌ నాయుడు, వెంకటేష్‌ నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, మురుగయ్య, జయచంద్ర, నాగరత్నం, రాజగోపాల్‌, ట్రైలర్‌ దాసు, సుబ్రహ్మణ్యం, నేతాజీ గిరి,బాలాజీ, దానియేలు, రమణయ్య, సాంబ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నగరి నియోజకర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలి
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
నగరి:
నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్‌, గాలి భానుప్రకాష్‌ ఆదేశాల మేరకు పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో నగరి నియోజక వర్గాన్ని తిరుపతి బాలాజీ జిల్లాలో కలపాలని నగరి పట్టణ, రూరల్‌ కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టారు.