ప్రజాశక్తి-చిత్తూరు : వెదురుకుప్పం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా పన్నూరు రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పరిధిలో ఆదివారం వెదురుకుప్పంలో జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టు పుల్లూరు రఘునాధరెడ్డి అధ్యక్షతన సమావేశమై ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాటూరు దేవరాజులు, గౌరవ అధ్యక్షులుగా పుల్లూరు రఘునాధరెడ్డి, ఉపాధ్యక్షులుగా వై. వరదారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సి. గోవిందు, కోశాధికారిగా జయచంద్రా రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా కోలా జయచంద్ర, కొత్తపల్లి రాజేంద్ర ఏకగ్రీవమయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా కామసాని మోహన్ రెడ్డి, మహేంద్ర, వెంకటేష్ రెడ్డి, సురేష్ రెడ్డి, చంద్ర, సుధాకర్ రెడ్డి ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు.










