Oct 25,2023 20:17

వధువు గాయత్రిని ఆశీర్వదిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి - లింగసముద్రం :తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు గొల్లపల్లి వెంకటేశ్వర్లు కుమారుడు రాంబాబు,రాజ్యలక్ష్మిల కుమార్తె గాయత్రి వివాహం బుధవారం రాళ్ళపాడు గ్రామంలో జరిగింది.ఈ వివాహ కార్యక్రమానికి కందుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జీ ఇంటూరి నాగేశ్వరరావు,ఒంగోలు పార్లమెంట్‌ టిడిపి అధ్యక్షులు డాక్టర్‌ నూకసాని బాలాజీ,టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్‌ దివి శివరాం పాల్గొని వధువు గాయత్రిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు వేముల గోపాలరావు,టిడిపి నాయకులు సయ్యద్‌ నాయబ్‌ రసూల్‌,మద్దెల రామారావు,పూరిమిట్ల మాల్యాద్రి,బోయిళ్ల కొండపనాయుడు,మండల కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ షఫి,మాజీ ఎంపిపి పూరిమిట్ల బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు