Mar 31,2022 22:23

ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తున్న దశ్యం


ప్రజాశక్తి-కార్వేటినగరం:
కార్వేటి నగరం లోని రాస్‌ వద్ధాశ్రమంలోని వద్ధులకు గురువారం కె.కె.సి పరమేశ్వర మంగళం లో ఉన్న హౌమియో వైద్య పాఠశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు డాక్టర్‌ జి.శరవన్‌ అన్నారు. ఈ సందర్భంగా అన్ని రోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా సరఫరా చేశారు. అదేవిధంగా కార్వేటినగరం లోని పంచాయతీ కార్యాలయంలో కూడా వైద్య శిభిరం చేపట్టారు. రోగులకు మందులు ఉచితంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ నాగరత్నమ్మ,సెల్వి,వైద్య అధికారులు డాక్టర్‌ ప్రసాద్‌,అరుణ్‌, మునఫ్‌, రోగులు పాల్గొన్నారు.