ప్రజాశక్తి-గణపవరం : అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని కాశిపాడు ఆరోగ్య సహాయకులు నామారాజు అన్నారు. బుధవారం స్థానిక ఉప కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నామాల రాజు మాట్లాడుతూ నెలలో మొదటి బుధవారం మూడవ బుధవారం గ్రామంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. గర్భిణీలకు రెండు టీడీ డోసు ఇంజక్షన్ తోపాటు 150 ఐరన్ మాత్రలు ఇస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శివకుమారి ఆశా వర్కర్లు వరలక్ష్మి కృష్ణకుమారి పాల్గొన్నారు.










