ప్రజాశక్తి-వెదురుకుప్పం : డాక్టర్ వైస్సార్ డిగ్రీ కళాశాల వెదురుకుప్పం నందు గౌరవ ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి ఆదేశాలతో దాతల సహకారంతో తాత్కాలిక తరగతి గదుల నిర్మాణాన్నీ ప్రారంభించడం జరిగింది. కళాశాలకు శాశ్వత భవనం నిర్మాణాకికి కొంత సమయం పడుతున్న నేపధ్యంలో జూనియర్ కళాశాలలో నడుపుతున్న విషయం తెలిసిందే.జూనియర్ కళాశాలలో ఉన్న తరగతి గదులు విద్యార్థు సంఖ్యకు సరిపోక విధ్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం ఉపముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో శాశ్వత భవనం నిర్మించే లోపు జూనియర్ కళాశాలలోనే తాత్కాలిక తరగతి గదులు నిర్మించాలని కళాశాల అభివృద్ధి కమిటీని ఆదేశించడంతో దాతలు డాక్టర్ వాసుదేవరెడ్డి ఎన్ ఆర్ ఐ మూడు లక్షలు,వై ఎస్ ఆర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె పద్మనాభరెడ్డి 50 వేలు, జడ్ పిటిసి సభ్యులు సుకుమార్ 50 వేలు రూపాయలతో నిర్మాణాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్ష్యులు బండి గోవర్ధన్ రెడ్డి ,జడ్ పి టి సి సభ్యులు సుకుమార్, మండల అధ్యక్షులు పేట ధనంజయులు రెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి కె పద్మనాభరెడ్డి,అభి వృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి పి .ఢిల్లీ ప్రసాద్ రెడ్డి,కమిటీ సభ్యులు బట్టే సుబ్రమణ్యం,బి సభాపతి.










