పుత్తూరు టౌన్ : బాదుడే ..బాదుడు కరపత్రాలు పుత్తూరు మున్సిపాలిటీ 14వ వార్డు మంగళవారం టిడిపి నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిడిపి నేత టీవీఎస్ ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ పన్నులు, ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై బాదుడే బాదుడు రూపంలో భారం మోపుతున్న వైసిపిని గద్దె దించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.టిడిపి హయాంలో ఉన్న ధరలకు, నేడు వైసిపి హయాంలోని నిత్యావసరాల ధరల వ్యత్యాసాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు జీవరత్నం నాయుడు, ప్రధాన కార్యదర్శి ఎన్ ఎన్ ధనపాల్, వార్డు, ఎన్. జయ చంద్ర నాయుడు, ఎం. వెంకటాద్రి, టి మునిస్వామి, రమణ, జీవా,మురళి , మునిస్వామి ఆటో, వేలు ఎస్సీ సెల్, చెంచయ్య జిల్లా ఎస్టీ సెల్, టీఎన్‌ఎస్‌ఎఫ్ బాలాజీ, రాము, సాయి,ఈశ్వర్ యాదవ్ పాల్గొన్నారు.










