పార్టీలో చేరుతున్న దృశ్యం
ప్రజాశక్తి -రాపూరు :మండలంలోని రాపూరు సచివాలయ -1 పరిధిలోని వాటర్ ట్యాంక్, మల్లమ్మ గుంట, ఆంజనేయపురంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. మదెల మడుగు సెంటర్‌లోని తెలుగు గంగ గెస్ట్ హౌస్‌లో వైసిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పాపకన్ను బ్రదర్స్ , భూపతి జయరామయ్య నేతత్వంలో 30 కుటుంబాలు టిడిపిని వీడి వైసిపిలో చేరాయి.వారందరినీ రామ్‌కుమార్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.










