Aug 17,2023 21:50

కండువాలు కప్పి వైసిపిలోకి స్వాగతిస్తున్న నాయకులు

        గుత్తి : మండలంలోని బాచుపల్లి గ్రామానికి చెందిన పలువురు గురువారం నాడు వైసీపీలో చేరారు. పట్టణంలోని రోడ్లు,భవనాల శాఖ అతిథి గహంలో జరిగిన ఓ కార్యక్రమంలో కరిడికొండ పంచాయతీ సర్పంచి కె.రమేష్‌ నాయుడు ఆధ్వర్యంలో టిడిపికి చెందిన పలువురు కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సర్పంచి కె.రమేష్‌ నాయుడు, వైసీపీ పట్టణ కన్వీనర్‌ డి.హుస్సేన్‌ పీరా, నాయకుడు కె.కృష్ణమోహన్‌ నాయుడులు వారందరికీ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.