అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్రంలో వైసిపి పాలనపై అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చిన టిడిపి గెలవడం ఖాయం అని ఆ పార్టీ జిల్లా నాయకులు సరిపూటి రమణ, నగర అధ్యక్షుడు మారుతికుమార్‌గౌడ్ అన్నారు. బుధవారం టిడిపి నియోజకవర్గం కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ టిడిపి అధినేత నారాచంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోపై వైఎస్‌ఆర్‌సిపి నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పార్టీ టిడిపి అన్నారు. రాబోవు రోజుల్లో పేదలు, మహిళలు, నిరుద్యోగులు, బడుగుబలహీన వర్గాల ప్రజలకు టిడిపి అండగా ఉంటుందన్నారు. వైసిపి చౌకబారు విమర్శలు మానుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నారాయణస్వామి యాదవ్, నగర మహిళా అధ్యక్షురాలు విజయశ్రీరెడ్డి, మాజీ కార్పొరేటర్లు నాటేష్‌చౌదరి, జానకి, ముక్తియర్, హొన్నూర్, గోపాల్ గౌడ్, కుళ్లాయప్ప, బాలప్ప, పరుసురాం పాల్గొన్నారు.










