Oct 25,2023 18:14

కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో నేను కార్యక్రమాన్ని కందుకూరు పట్టణం 18వ వార్డు ఉర్ధూ పాఠశాల పరిధిలో బుధవారం నిర్వహించారు. కందుకూరు నియోజ కవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, ఇతర నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలు పంచారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ 18వ వార్డులో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, స్థానికులు దోమలు, విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముస్లిములకు మేలు ఏమీ జరగలేదన్నారు. ఏ ఇంటికి వెళ్లినా సమస్యల గురించి చెబుతూ ఆవేదన చెందుతున్నారన్నారు. టిడిపి ప్రభుత్వం హయాంలో లాగా ఈ ప్రభుత్వంలో అభివద్ధి జరగడం లేదన్నారు. తమ గురించి స్థానిక ఎంఎల్‌ఎ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక యువకులు నాగేశ్వరరావు దష్టికి తెచ్చారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు నగర జయకష్ణ నాయకులు రావి జాలయ్య, సయ్యద్‌ జియావుద్దీన్‌, షేక్‌ రాహుల్‌, మహబూబ్‌ బాషా, గనిపినేని నరసిం హారావు, సుభాని, ఫాజిల్‌, రబ్బాని, బాబు చంటి, సోహెల్‌, అహ్మద్‌, మోహిసిన్‌, ఆరాఫత్‌, బాబు (బిఎస్‌ఎన్‌ఎల్‌), మహబూబ్‌ బాషా, కరీముల్లా, యాసీన్‌, సుల్తాన్‌, ఫైరోస్‌, దేవా, నాయకులు చదలవాడ కొండయ్య, వడ్డెళ్ళ రవిచంద్ర, రాయపాటి శ్రీనివాసరావు, షేక్‌ రఫీ, షేక్‌ సలాం ఉన్నారు.