వైసిపి జెండా ఆవిష్కరణ
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : వైఎస్‌ఆర్‌సిపి కంచుకోటగా పేరుగాంచిన కొమరిక గ్రామంలో సీనియర్ నాయకులు గూడూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైసిపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసిపి మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులు రెడ్డి విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. కొమరిక గ్రామానికి చెందిన గూటం వెంకట్ శేషయ్యకు ఫిష్‌ఆంధ్ర స్కీం మంజూరు కాగా బుధవారం వైసిపి మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపిపై మక్కువతో పార్టీని ప్రారంభించిన రోజు నుండి ఇప్పటివరకు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తూ, ఉన్న ఏకైక నాయకులు గూడూరు ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. ఎప్పటికప్పుడు గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తూ, అహర్నిశలు గ్రామం కోసం పాటుపడుతున్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అన్ని విధాల కొమిరిక గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభాకర్ రెడ్డిని ఆయన అభినందించారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు, మంచి చేపలను పౌరులకు అందించేందుకు ఫిష్ ఆంధ్ర స్కీం ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయుకులు మాజీ మండల అధ్యక్షులు కైలాసం ఆదిశేషారెడ్డి, ఎంపిటిసి చెన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షులు గూడూరు శివకుమార్ రెడ్డి, వైస్ సర్పంచ్ కొండవీటి సురేంద్ర, గూడూరు సురేష్ రెడ్డి, బండ్ల జనార్ధన్, చేవ్వూరు మల్లికార్జున, వేణుంబాక మహిధర్ రెడ్డి, నాగేశ్వరరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










